

జనం న్యూస్ ఆగస్ట్ 28
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం గుమ్మడిదల మండల కేంద్రంలోని సిజిఆర్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రహదారులపై నీరు నిలిచిన చోట్ల వాహనాల రాకపోకలు తగ్గించాలని, విద్యుత్ తీగలు తెగిన ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ప్రజలు కలసి ముందుకు సాగితేనే వరద ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని స్పష్టం చేశారు. వర్షాలు కొనసాగుతున్నంతవరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి,తుపాకులరాజు, విశాల్ గౌడ్,బాల్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి, సాయి రెడ్డి, భార్గవ్ చారి, గోపాల్,యాదిరెడ్డి,లక్ష్మణ్, సత్యనారాయణ, పాల్గొన్నారు.