Listen to this article

జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు టర్నింగ్‌ తిరుగుతుండగా అదుపు తప్పడంతో ఆఖరి రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. గూడ్స్‌ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు.