

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు నల్లనయ్యకు ప్రధానం చేయనున్న రాష్ట్ర సాంసృ్కతిక శాఖ
నల్లనయ్యకు అభినందనల వెల్లువ
జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక, సాహిత్య పరంగా తన ఒక్కరికే సాధ్యమైన విశేష సేవలందిస్తూ వస్తున్న విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న పల్లి నల్లనయ్య సేవలకు గాను మరో విశిష్ట పురస్కారం దక్కింది. తెలుగు భాషకు నల్లనయ్య తన సర్వం ధారబోస్తూ తనకే సాధ్యమైన రీతిలో అనేక రచనలు చేస్తూ ఇప్పటికే తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించుకున్నారు పల్లి నల్లనయ్య. ఒకవైపు ప్రభుత్వ అధికారిగా ఉత్తమ సేవలందించడమే కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కర్తవ్యాలను సక్రమంగా నెరవేరుస్తూ, స్థానిక ఎమ్మెల్యే అధితి విజయలక్ష్మి గజపతిరాజు ఆశయాలకు అనుగునంగా, నగర పాలక సంస్థ పాలక మండలి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ వస్తున్న నల్లనయ్య, అదే సమయంలో తెలుగు భాషకు ఎనలేని సేవలందిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారికంగా ప్రకటించింది. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం ఉదా చిల్డ్రన్స్ థియేటర్ లో శుక్రవారం (నేడు) నిర్వహించనున్న ప్రత్యేక సభలో వల్లి నల్లనయ్యకు గిడుగు రామ్మూర్తి పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. తెలుగు భాషలో గేయ రచనలలో విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఈమేరకు ప్రతిష్టాత్మకమైన గిడుగు రామ్మూర్తి అవార్డును ప్రకటించింది. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేపథ్యంలో అవార్డును అందుకోనున్న కమిషనర్ పల్లి నల్లనయ్యకు పలువురు ప్రముఖులు, అధికారులు, అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. నల్లనయ్యకు విశిష్ట పురస్కారం పట్ల సాహితీ లోకంతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.