Listen to this article

జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. విజయనగరంలోని తిరుమల మెడికేవర్‌ హాస్పిటల్‌లో ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ తిరుమల ప్రసాద్‌ రాష్ట్రంలోనే మొట్టమొదటి టలిసర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం నుండి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. టైర్‌-3 నగరంలో జరిగిన తొలి టలిసర్జరీగా ఇది గుర్తింపు పొందింది.
50 రోబోటిక్‌ సర్జరీలు పూర్తి చేసిన డాక్టర్‌ ప్రసాద్‌ ఈ ఘనత సాధించారు. ఈ విజయం వైద్య సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్‌ పురోగతిని సూచిస్తుంది