Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 2వ సారి సాయి లోకేష్ ఎంపిక కావడం పట్ల కిరణ్ కుమార్ అలాగే ఎన్డీఏ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ మౌల.పఠాన్ మెహర్ ఖాన్. భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో సాయి లోకేష్ కు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కోసం పార్లమెంటు స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో మండలాల నుండి మారుమూల గ్రామాల వరకు కేంద్రం నుంచి వస్తున్న వంటి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ సభ్యత్వ నమోదులో యువతను ముందుంది నడిపించి ఎన్డీఏ నాయకులతో కలిసిమెలిసి ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ బిజెపి పార్టీని పార్లమెంటు స్థాయిలో మరింత బలోపతం చేసినందుకు అధిష్టానము ఆయనకు రెండవసారి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిందని ఎన్డీఏ నాయకులు తెలిపారు.అనంతరం చరవాణిలో మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ సాయి లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు శివ నర్సింహులు. బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య. షబ్బీర్ అహ్మద్. విఠలాచారి. చుక్క శ్రీనివాసు. జయరామరెడ్డి. శివరెడ్డి. తదితరులు పాల్గొన్నారు