

జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి
టీడీపీ సీనియర్ నాయకుడు పీఎస్ఎన్ రాజు(విలేఖరి రాజు) శివ, శివాజీ, మిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కర్రీ మ్యాన్ “రెస్టారెంట్”ను గురువారం శేరిలింగంపల్లి చైర్మన్ ఎమ్మెల్యే, పీఏసీ అరెకపూడి గాంధీ ప్రారంభించారు.డీఎల్ఎఫ్ 3వ గేటు సమీపంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాజు వారి బిర్యానీ ద్వారా గోదావరి జిల్లాల్లో గుర్తింపు పొందిన “విలేఖరి రాజు” తమ నియోజక వర్గంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ అడపా దుర్గ,డైరక్టర్ చందు మొండేటి, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, కోనసీమ కూటమి నాయకులు భూపతిరాజు శివ కుమార్ వర్మ (గబ్బర్ సింగ్ ) నడింపల్లి సుబ్బరాజు,సయ్యపరాజు రామ కృష్ణ రాజు, త్సవటపల్లి నాగు, చెల్లి అశోక్, త్సవటపల్లి శ్రీనివాస్,మోకా అప్పాజీ,మోకా బాల ప్రసాద్, ఎస్ వి ఎస్ వర్మ, కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్, వైసీపీ సీనియర్ నాయకులు నడింపల్లి సూరిబాబు,సినీ నటుడు గౌతం రాజు, సినీ నటుడు పెద్దింటి సురేష్ జర్నలిస్టులు జేడీ, జగదీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

