Listen to this article

పార్వతీపురం జనం న్యూస్ తేది ఆగష్టు 28,( రిపోర్టర్ ప్రభాకర్):

బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరం బాల్యవివాహా నిషేధ చట్టం 2006 ప్రకారం దేవాలయాల్లోన, చర్చి, మసీదు, ఇతర ప్రదేశాలలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని మహిళ శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయిన్ డైరెక్టర్ మేడం జి చిన్నయ్య దేవి మరియు ఐ సి డి ఎస్ పి.డి ,టి. కనకదుర్గ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం ఐటిడిఏ గిరి మిత్ర మీటింగ్ హాలులో సిడిపిఓ లందరికీ CMAM పైన శిక్షణ కార్యక్రమమునకు హాజరయ్యారు. అనంతరం అపహోల్డ్ యాక్సిస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ వారు రూపొందించిన బాల్యవివాహాలు నిషేధంపై పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఆలయాల్లోని ప్రతి పూజారి బాల్యవివాహాలను వ్యతిరేకించాలని ఆలయాల యందు ఈ పోస్టర్ను అంటించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.