Listen to this article

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలోని బాబామెట్టలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.బాబా మెట్టలోని సప్తగిరి అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి మహిళలు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో వారి నుంచి రూ.14,016, నాలుగు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.