

డోంగ్లి ఆగస్టు 30 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి డోంగ్లి లింబూర్ సమీపంలో ప్రధాన రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు ఈ మార్గంలో హసన్ టాక్లీ పెద్ద టాకీ సిర్పూర్ మీదుగా బోధన్ నిజాంబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు చేస్తారు