Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 30:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల లోని గోదావరి పరివాహక గ్రామాలైన దొంచంద, గుమ్మిర్యాల్ లో శ్రీరామ్ సాగర్ వరదల వల్ల ముంపుకు గురైన పసుపు తోటలను శనివారం రోజునా జిల్లా ఉద్యాన అధికారి బండారి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వరద వల్ల పసుపు తోటలు పూర్తిగా మునిగిపోయయని ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి సమర్పించగలమని ,వరద నీరు పూర్తిగా తొలగిపోయిన తర్వాత వెంటనే ఒక ఎకరానికి 50 కిలోల వేపపిండిని వెదజల్లుకొని మెటల్క్సిల్ + మాన్కోజేబ్ మందును లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి మొదలు బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్శనలోతాళ్ళరాంపూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగారెడ్డి, మండల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవరెడ్డి, పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త మహేందర్, మండల తహశీల్దారు మల్లయ్య మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్, ఎ.ఈ.ఓ సచిన్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.