Listen to this article

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని గట్లకనిపర్తిలో గ్రామంలో ఈ నెల 26 తేదీ రోజున ప్రబుత్వo నిర్వహించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలో, మద్యం మత్తులో బొమ్మకంటి ప్రశాంత్ తండ్రి బొమ్మ కంటి నందయ్య, వయసు 32 సంవత్సరాలు కులం: ఎస్ సి -మాదిగ, వృత్తి: డ్రైవర్, గ్రామం గట్లకనిపర్తి అను అతను స్టేజి పైనకి కోడిగుడ్లతో దాడి చేయగా, అతడిపైన కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి పర్కాల కోర్ట్ నందు హాజరుపరుచగా అతడికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చేర్యలకి పాల్పడితే సహించేది లేదని చట్టం పరిధిలో కఠిన చర్యలు ఉంటాయని సీఐ రంజిత్ రావు హెచ్చరించారు. మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రభుత్వ ప్రొగ్రాం జరుగుతున్నప్పుడు ఎలాంటి న్యూసెన్స్ చేసిన దాడులకు పాల్పడిన ప్రభుత్వ అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని సీఐ రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేష్ తెలియజేశారు….