Listen to this article

జనంన్యూస్. 30.సిరికొండ. ప్రతినిధి.

నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్తలను వెంటనే అందించాలి. సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్.అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని,ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమేఆదుకోవాలని, నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్తలను వెంటనే అందించాలని.వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వర్ధల్లో ముంపుకు గురైనా గ్రామాలు, పంట పొలాలను పరిశీంచారు. భాదితులను శనివారం నాడు సిపి(ఎంఎల్) మాస్ లైన్ స్థానిక నేతలతో బృందంగా పరామర్శించారు. శనివారం నాడు సిరికొండ మండలం లోని గడ్కోల్, ధర్పల్లి మండలంలోని వాడి గ్రామాల్లో సందర్శించారు.ఈ సందర్బంగా . వి. ప్రభాకర్ మాట్లాడుతు.భారీవరదల వల్ల సిరికొండ మండలంలోని కప్పలవాగు పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగి ప్రజలను ఆర్థికంగా ఇండ్లు, ఎలక్ట్రికల్ వస్తులను కూడా కోల్పోయేలా చేసి కట్టు బట్టలు తో మిగిలారు అని అన్నారు. వరదలు వానాల వల్ల తక్షణమే ప్రభుత్వం మానవతతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువుల తో పాటు ఆర్థిక సాయం అందించాలన్నారు. వానలు వరదల వల్ల ప్రజలు ఇల్లు కూలిపోయి, పొలాలకు సంబంధించిన యూరియా బ్యాగులు నిలువ ఉంచుకున్నవి కోల్పోయి, కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డరన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనన్నారు. ఇండ్లు కోల్పోయినవారికి 1లక్ష, పంటకోల్పోయిన రైతంగానికి ఎకరానా 50వేలు ఇండ్లు నీటమునిగిన వారికి 50వేలు, యూరియా బస్తాలు, బియ్యం సంచులు కోల్పోయిన వారికీ 50వేలు, తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.