

జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్
జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని ముట్రాజు పల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీ, సంగాపూర్, బాయ్స్ హబ్, గర్ల్స్ హబ్ లోని ఉన్నత పాఠశాలలు, బంగ్లా వెంకటాపూర్, మక్త మసాన్ పల్లి, రంగం పేట్, కోమటి బండ, ధర్మారెడ్డి పల్లి, గిరిపల్లి, జాలిగామ తదితర పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి
సుంచు నరేందర్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనకోసం ఉద్యమాలు చేసి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో 317 జి వో ద్వారా ఉపాధ్యాయులను స్థానికత కోల్పోయేలా ఇతర జిల్లాలకు కేటాయించడం అన్యాయమని,,నూతన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంత మంది ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకవచ్చినప్పటికి, ఇంకా కొంత మంది సొంత జిల్లాలకు దూరంగా వున్నారని, స్థానికత ఆధారంగా వెంటనే వాళ్ల సొంత జిల్లాలకు రీ అలకేషన్ చేయాలనీ డిమాండ్ చేసారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 01 కింద నెల మొదటి తారీఖున వేతనాలు చెల్లించాలని, సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలనీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ను రద్దు చేసి, పాత పెన్షన్ ను పునరుద్దరించాలని, పి ఆర్ సి ని,వెంటనే అమలు చేయాలని, పెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్, ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జల్లెల శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ దమ్మని మల్లయ్య,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాళ్ల నాగరాజు, గోక విద్యా సాగర్,సీనియర్ నాయకులు పెంటయ్య,పర్వతం నర్సయ్య,శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు