Listen to this article

జనం న్యూస్, జనవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

గజ్వేల్ లోని రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో, గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత మహాయజ్ఞం నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. దేవాలయంలో భక్తులచే 2గంటల పాటు రామనామ స్మరణ చేయించి రామ, శివ నామాలను లిఖింపజెయించారు. అక్కడే లిఖించి రామకోటి రామరాజు కి అందజేశారు.

అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేయాలన్నారు. చివరికి తోడుండేది మనం చేసుకున్న పుణ్యమే అన్నారు. ఈ నామాలను త్వరలో శృంగేరి పీఠంకు అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో చిలుముల సీతారాములు, శ్రీను, కొమురయ్య, శ్యామ్, స్వామి, ఆంజనేయులు, సురేందర్, నర్సింలు, నాచగిరి, ముత్యం పాల్గొన్నారు.