Listen to this article

జనం న్యూస్.ఆగస్టు30. సంగారెడ్డి జిల్లా.హత్నూర.

మధుప్రియ డైరీ కేంద్రంపై ప్రత్యేక పోలీసుఅధికారుల బృందం శనివారం దాడులు నిర్వహించి
210 లీటర్ల కల్తీ నెయ్యితో పాటు10 కిలోలనెయ్యి బకెట్లు.ఆరు30లీటర్ల పెద్దక్యాన్లు రెండు.కాటన్ మంచినూనె ప్యాకెట్లు కాన్ ఫ్లోర్ పౌడర్ టెస్టింగ్ సాల్ట్ బ్రేకింగ్ సోడాఇతర కెమికల్స్ ముడిసరుకులు స్వాధీనం చేసుకున్న సంఘటన హత్నూరమండలంలో చోటుచేసుకుంది.సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గోవింద్ రాజ్ పల్లి గ్రామ శివారులోని మదు ప్రియ పాల డైరీకేంద్రంలో కల్తీపాలు. నెయ్యి,వెన్న,తయారుచేస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో ప్రత్యేక విభాగం పోలీసులతో పాటుహత్నూర పోలీసుల తనిఖీలుచేశారు.210 లీటర్ల కల్తీనెయ్యితో పాటు నెయ్యి తయారుచేయడానికి ఉపయోగించే నూనె ప్యాకెట్లు కల్తీ ముడీసరుకులను స్వాధీనం చేసుకున్నారు.కల్తీ నెయ్యి తయారు చేస్తున్న నిర్వాహకుడినిపోలీసులు అదుపులోకి తీసుకోని కల్తి నెయ్యి సరఫరాలకు ఉపయోగించే వాహనం స్వాధీనం చేసుకున్నారు.డైరీ నిర్వాహకునికి అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.