Listen to this article

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ప్రభుత్వాలు మారినా పేదల కోలనీల్లో మౌళిక వసతుల కల్పించండి అని పాలకులు, అధికారులు చుట్టూ కాళ్ళు అరిగేలా ఎన్నేళ్ళు ప్రదక్షిణలు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజమెత్తారు.
శనివారం ఉదయం జామి మండలంలో నెయ్యిల వీధిలో ఎలక్రికల్ సబ్ స్టేషన్ దగ్గరలో ఉన్న జగన్నన్న కొలనీలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను శనివారం పత్రికల్లో ప్రచురితమైన కథనం పై స్పంచింది భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) జామి మండల సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఎస్. కోట నియోజకవర్గ కార్యదర్శి ఖండేపల్లి భీముడు, సహాయ కార్యదర్శి డేగల అప్పలరాజులతో కలిసి చేసిన పర్యటనలో భాగంగా స్థానిక పేదలు అంత కలిసి ఎన్నో ఏళ్ళుగా 24 కుటుంబాలం పూరి గుడెసల్లో ఇక్కడే నివాసం ఉంటున్నామని తెలిపారు. వైసిపి ప్రభుత్వ హయంలో మేము నివాసం ఉన్న చోటే పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఋణ సదుపాయం కల్పించారు కానీ ఆ డబ్బులు ఏమేరకు సరిపోకపోవడం వలన మేము కొంత అప్పులు చేసుకుని ఇళ్ళు నిర్మాణం చేసుకున్నాము కానీ ఇంతవరకు మా ఇళ్ళకి విద్యుత్తు సరఫరా చేయకుండా, కోలనిలో ఎలక్ట్రికల్ స్థంబాలు వేయలేదు, వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు, మంచి నీటి సదుపాయం లేదు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం మొదలైన కనీస మౌళిక వసతులకు మేము నేటికీ నోచుకోలేదని, పక్కనే నది, చుట్టూ డొంకలు ఎక్కువ ఉండటం వలన రాత్రి అవ్వగానే చిమ్మ చీకట్లో విషపూరితమైన పాములు, పురుగులు ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయని, పసిపిల్లలతో ఉంటూ చాల భయాందోళనలతో జీవనం సాగిస్తున్నామని మా సమస్యలు పరిష్కారం చేయండి అని మేమంతా ఎన్నిసారు పాలకులు చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని సిపిఐ నాయకులతో పేదల ఆవేదన చెప్పుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పేదలతో బుగత అశోక్ మాట్లాడుతూ ఎన్నేళ్ళుగా మీరు కష్టాలు అనుభవిస్తున్న స్థానిక పాలకుల కళ్ళకి కనపడలేదా, ఇళ్ళు నిర్మాణం కోసం చాలీచాలని ఋణం విధిల్చేస్తే భాధ్యత తిరిపోయినట్టేనా అని మండిపడ్డారు. పెదలంటే కేవలం మీ దృష్టిలో కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోలనీలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుని ఏదో ఘనకార్యం సాధించినట్టు పాలకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాలనీలు ఏర్పాటు చేసిన తరువాత అందులో ప్రజలు నివాశయోగ్యంగా ఉండే విధంగా కనీస మౌళిక వసతులు కల్పించడం కోసం అవసరమైన నిధులు కేటాయించాలన్న కనీస అవగాహన పాలకులకి లేకపోవడం చాలా సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. నెయ్యిల వీధి జగనన్న కొలనిల్లో ఉన్న పేదలకి అండగా సిపిఐ నిలబడి కొలనీలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతుందని తెలిపారు. మీ సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశి జట్టు నాయకులు కె. కృష్ణ తో పాటు స్థానిక పేదలు పాల్గొన్నారు.