

జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా
జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం డాక్టర్స్ జా,శ్రీనివాస నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో బీపి, షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) 42వ డివిజన్, కామాక్షినగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో నిర్వహించారు.ఈసందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన జనసేన యువ నాయకులు,ఎ.ఎం.సి. వైస్ చైర్మన్ బొబ్బాది చంద్రునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 42వ డివిజన్ పరిధిలో అయ్యన్నపేట, కామాక్షినగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలావరకు బీపి, షుగర్ పరీక్ష శిబిరాన్ని వినియోగించు కున్నారని,ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకే సొంతమని జిల్లా చిరంజీవి యువత, జనసేన సేవాదళ్ చేస్తున్న సేవలను కొనియాడారు.సుమారు నూటాయేబైమంది సేవలు వినియోగించు కున్న ఈ శిభిరానికి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి బృందం సేవాలందించారు.కార్యక్రమంలో శ్రీ సాయికృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ, క్లబ్ పెద్దలు యాగాటి నలమహారాజు, కోట్ల సత్యనారాయణ, కోట్ల ఈశ్వరరావు, జె.వి.ఎస్. ప్రసాద్, పి. అప్పలరాజు, పాత్రుడు, ఐ. అప్పలరాజు, పతివాడ శ్రీను తదితర పెద్దలు భారీగా పాల్గొన్నారు.