

జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం)
చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని చింతలచెరువు వరద నీరు రాష్ట్ర రహదారిపై చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, కార్మికులు ఈ మార్గాన్ని వినియోగించుకుంటుండగా, రహదారి పైకి చేరిన నీరు రవాణాకు ఆటంకంగా మారింది. స్థానికులు చెబుతున్న ప్రకారం, చెరువు ముందు భాగంలోని బఫర్ జోన్ పరిధిలో బౌహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం వల్లే వరద నీటి ప్రవాహం ఆగిపోతోందని, దీనివల్ల నీరు రహదారిపై నిలిచిపోతోందని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “కాసులకు కక్కుర్తి పడి అధికారులు నిర్మాణాలను ఆపకుండా చూసేయడం, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం తప్పద” అని స్థానికులు చ్చరిస్తున్నారు. ప్రజలు డిమాండ్ చేస్తూ, వరద నీటిని మళ్లించే విధంగా భారీ స్థాయిలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రహదారి రవాణా సౌకర్యాలు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.