Listen to this article

దౌల్తాబాద్ గ్రామపంచాయతీ అధికారుల నిర్వాహకం ఇబ్బంది పడుతున్న బాధితులు

జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

నిర్మాణం పూర్తిగా కూల్చేసిన అధికారుల వేధింపులు మాత్రం ఆగడం లేదు.కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఓ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అధికారులు మళ్లీ మళ్లీ నోటీసులు ఇస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గత 50 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డును దౌల్తాబాద్ గ్రామపంచాయతీ అధికారి నోటీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆ షెడ్డు తాలూకు మహమ్మద్ దస్తగిరి,మహమ్మద్ నసీర్,ఆరోపించారు.దౌల్తాబాద్ గ్రామపంచాయతీలో రివిజన్ రికార్డు.అసెస్మెంట్.యజమాని ధ్రువీకరణ పత్రం రికార్డులు అన్ని ఉన్నప్పటికీ పంచాయతీ జిల్లా అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.నిర్మాణం అనుమతులు లేవని సాకుతో జిల్లా పంచాయతీ అధికారి తాను కట్టుకున్న రేకుల షెడ్డును పంచాయతీ అధికారులు జెసిబి సహాయంతో తొలగించారని బాధితులు తమఆవేదన వ్యక్తం చేశారు.రేకుల షెడ్డు వివాదంపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ తమకు పదేపదే నోటీసులు ఇస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు అన్నారు.అనవసరంగా తమకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో ఈనెల4 నాలుగో తారీకు రోజున సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లుబాధితులు తెలిపారు.అయినా మళ్లీ నోటీసులు ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.