

జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం , కాట్రేని కోన
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన చెయ్యేరు జనసైనికులు, పండుగ వాతావరణంల సాగిన రక్తదాన శిబిరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులుకొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 ఒకరోజు ముందుగానే కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు వేగుళ్ళ లీల కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ చక్కని పనితీరు కనబరుస్తూ యువతకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారనిత్స వట పల్లి నాగభూషణం పేర్కొన్నారు. 150 యూనిట్లు రక్త సేకరణ లక్ష్యంగా రక్తదాన శిబిరం సాగుతుందని మణికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఏఎంసి చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీ,దాట్ల పృథ్వి, గుద్దటి జమ్మి,చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు,నంద్యాల వెంకటేశ్వరరావు,కంచు స్తంభం కిరణ్ కుమార్, మట్ట శివకుమార్ మట్ట సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
