

జనం న్యూస్ సెప్టెంబర్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
తెలంగాణలో చారిత్రాత్మకంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది,ఇది రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పోరాట ఫలితంగా బీసీల సమిష్టి విజయమని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా అన్నారు. మునగాల మండల కేంద్రంలో ఒక పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడమే లక్ష్యంగా,పంచాయతీ రాజ్ చట్టం–2018,పురపాలక చట్టం–2019లో ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తూ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడం,వాటిని అసెంబ్లీ ఆమోదించడం సంతో షకరమైన పరిణామమన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చల అనంతరం అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బిల్లులకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్ధం కావడం తెలంగాణ రాజకీయ,సామాజిక చరిత్ర లో కీలక మలుపుగా నిలిచిందని, ఇది బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధికి,సామాజిక న్యాయానికి పునాది వేస్తుందని అని అన్నారు.