Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ (1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం

లో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేసినాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు,బిజెపి డైరెక్షన్లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని సిబిఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చోటే బాయ్ బడే బాయ్ కలిసి కేసీఆర్ ను తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు అని అన్నారు. కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాళ్లేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలము అయ్యిందని అన్నాడు. తెలంగాణ ద్రోయి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏనాడు జైలుకు వెళ్లలేదు అని జై తెలంగాణ అని కూడా నినాదం చేయని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశించడం అంటే తెలంగాణ రైతాంగాని అవమానించినట్లే అని అన్నాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.