Listen to this article

ఎంపీ రమేష్ కు ఎ ఐ టి యు సి వినతి

జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయము ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు . ఈ సందర్భంగా అధ్యక్షులు కోన లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు పెద్దిరెడ్లనాగేశ్వరరావు,కోరుబిల్లి జగదీష్* మాట్లాడుతూ ఆటో డ్రైవర్లుకు ఓలా, ఊబర్, రాపిడ్ 2 వీలర్ లాంటి ఆన్లైన్ యాప్లు రద్దు చేయాలి, అటో డ్రైవర్లుకు వాహన మిత్ర పథకంద్వారా ఏడాదికి రూ॥25,000/-లు మంజూరు చేయాలి, ప్రమాదాలద్వారా మరణించిన, అనారోగ్యంతో మరణించిన మరియు అంగవైకల్యం ఏర్పడిన ఆటో కార్మికులకు పిఎఫ్,ఈఎస్ఐ తో కూడిన పీఎం జెజెబివై పి ఎం ఎస్ బి వై ఇన్సూరెన్స్ తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయించాలి,అధిక జరిమానాలుతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జి.వో.నెం.21 మరియు 31లు రద్దు చేసి ఆటో, మోటార్ కార్మికును ఆదుకోవాలి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లుకు పావలా వడ్డీతో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పోరేషన్ల ద్వారా ఋణాలు మంజూరు చేయాలి ఫిట్వెష్, డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేసే భాధ్యతను ప్రవేటు సంస్థలకు అప్పగిం చడంవలన వందలలో వేల రూపాయలలో చలానాలు భారం ఆటో డ్రైర్లపై పడుతుందిన్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కోంటున్న సమస్యలను పరిస్థితులను ధృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు డి. మార్కెండేయలు, సహాయ కార్యదర్శిలు సూరిశెట్టి బాపు నాయుడు, కోణతాల రాము, సభ్యులు మంగ నాయుడు, తదితరులు ఉన్నారు.//