

జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి ₹ 2746.52 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రతినెల ఖర్చు చేస్తుందని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీశ్వర రావు ఈరోజు ఉదయం చినరాజుపేట సాంబశివ గుడి ఏరియాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లు వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు పంపిణీ చేశారు. దివ్యాంగులకు పెన్షన్లు రద్దు చేస్తున్నారని వైసిపి సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని, గత ఎనిమిది నెలలుగా చేపట్టిన వికలాంగుల సర్టిఫికెట్లు తనిఖీల్లో ఒక లక్ష 35000 మంది సర్టిఫికెట్లు అనర్హులు గా గుర్తించారని వారికి నోటీసులు జారీ చేశారని, ప్రభుత్వం వీరిలో అర్హులు ఉంటే ఆపిల్ చేసుకోవాలని సూచించిందని, అలా ఆపిల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని 95% మంది ఆపీలు చేసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందని వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులు అందరికీ కూడా అందించాలని కూటమి ప్రభుత్వం ప్రకటన చేసిందని, వైసీపీ దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేస్తున్నట్లుగా ఫేక్ ప్రచారాలతో దివ్యాంగుల్లో ఆందోళన కలిగించి మానసికంగా వేధించారని నాగ జగదీష్ వైసీపీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్ బోడి వెంకటరావు అయిత అప్పలనారాయణ సూరే సుబ్బారావు పంచదార్ల శ్రీనివాసరావు ఆండ్రా బాబురావు రోకళ్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు.//