

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
సిఐటియు ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరావధిక నిరాహార దీక్షలు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వక ప్రతినిత్యం మహిళలతో మమేకమై వారి ఆర్థిక అభివృద్ధి కొరకై వారి కుటుంబాల వృద్ధి కొరకై బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలాగా సందేహాలు నివృత్తి చేస్తూ నడిపిస్తారు ప్రతినిత్యం అనేక యాప్లు ద్వారా మహిళ ల జీవన పరిస్థితులను వారి స్థితిగతులను తెలుసుకుంటూ మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారు అయితే ప్రభుత్వం వీరి పట్ల చులకన భావంతో జీతాలు చెల్లించక పొగ రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధుల నుండి తొలగించడం కొత్తవారిని చేర్చుకోవడం పనిచేసే వారి పట్ల వేధింపులు గురి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో వేధింపులు గురియై ఎప్పుడు ఈ బెడద నుండి విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తే కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది ముక్కు చెవులు కోసిన ముందు మొగుడె మంచివాడు అన్న సామెత మారింది కూటమి ప్రభుత్వం తీరు అధికారంలోకి రాగానే కొంతమంది విధుల నుండి తొలగించడం వీరి జీతాలకు బడ్జెట్ కేటాయించకపోవడం ప్రశ్నించిన వారిని ఫలానా పార్టీ వారిని అధికారం జూలుం చూపించడం జరుగుతుంది రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న వెలుగు యానిమేటర్లను వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా పని భారం పెంచి అనేక రకాల యాప్లను ద్వారా ప్రతినిత్యం పనిలో ఉండేలా చేస్తూ పనికి తగ్గ సరీరైన జీతం లేకపోగా సకాలంలో జీతం చెల్లింపులు చెల్లించకపోవడం బాధాకరం గతంలో చంద్రబాబు హయాంలోనే ఈ వెలుగు ప్రాజెక్ట్ మంచి అభివృద్ధిలోకి నడిచింది మహిళలను లక్షాధికారులుగా చేస్తానని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మన చంద్రన్న ఆరోజు వెలుగు ప్రాజెక్టును అభివృద్ధి పథంలో నడిపించారు కానీ గత ప్రభుత్వం హయాంలో రాజకీయంగా వేధింపులకు గురై అష్ట కష్టాలు పడ్డారు వివో ఏల యానిమేటర్లు ఇప్పుడైనా మా జీవితాల్లో వెలుగు నింపుతాడని కొండంత ఆశతో చంద్రన్న వైపు ఎదురుచూస్తున్నారు మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వారు ప్రతినిత్యం ఆవేదన చెందుతున్నార ఇలాంటి స్థితిలో ఉన్నాము కాబట్టే మా బాధను నిరసన రూపం లో తెలియజేస్తున్నామే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు కాదు మా గోడు వినండి బాబు అంటూ వెలుగు యానిమేటర్లు మొరపెట్టుకుంటున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం తీరు మారేనా సకాలంలో జీతాలు చెల్లింపులు జరిగేనా వేచి చూడాల్సిందే అంటూ ఏమైనా జరగని మా పోరాటం మాదే అంటూ వెలుగు యానిమేటర్లు నిరహర దీక్షలు చేస్తున్నారు, *రాజకీయ వేధింపులతో విధుల నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి పాత బకాయిలు కనీసం ఆరు నెలల జీతాలు అయినా చెల్లింపులు చెల్లించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతాలను వారి సొంత కాతాల్లోకి జమచేయాలి కాలపరిమిన రద్దు చేయాలి కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఈ దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే మాదిరిగా పల్నాడు జిల్లా కలెక్టర్ వద్ద కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి మరియు సిఐటియు శ్రామిక మహిళ కన్వీనర్ శివకుమారి జిల్లా వివో ఏల యానిమేటర్ సంఘం అధ్యక్షురాలు ఎన్ ఏసుమ్మ ట్రెజరర్ ఎం శ్రీదేవి జిల్లా వివో ఎల యానిమేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు, ఎద్దు సురేఖ, షేక్ నన్నేసాహెబ్, అచ్యుత్ కుమారి బి , భువనేశ్వరి బత్తుల సుధామయి ఎల్ ప్రమీల జీ జోత్స్న పి సుజాత పి ఉషారాణి ఎన్ మహాలక్ష్మి పి సుశీల ఎస్కే గౌస్య భాయ్ ఎం కోటేశ్వరరావు ఎస్ కే మహబూబ్ కె నాగమణి సిహెచ్ రమణ యు శైలజ లక్ష్మయ్య ఏం అచ్చియ్య మాధవి తదితరులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.