

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 27 (జనం న్యూస్): ఏపీ: వైయస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ని తెలుగు దేశం పార్టీ లోకి తీసుకోబోమని యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘తన సొంత తల్లి, చెల్లినే నమ్మని వైఎస్ జగన్ వేరెవరినీ నమ్మరని, అందుకే విజయసాయి వంటివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని అభిప్రాయపడ్డారు. మా పార్టీని, కార్యకర్తల్ని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం? అంటూ ప్రశ్నించారు. విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు