Listen to this article

నిర్వహించిన పోచారం గ్రామ ప్రజలు

4 లక్షల10 వేయిల రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్న చిదురుప్ప భాస్కర్ గౌడ్

సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింపజేసిన కళాకారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పోచారం గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుండి వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని గణనాధుని ప్రతిష్టించుకొని నవరాత్రులలో గ్రామ పెద్దలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామనీ ఆ గణనాథుని ఆశీర్వాదంతో పోచారం గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నామని హనుమాన్ యూత్ అసోసియేషన్ .సభ్యులందరికీ మా గ్రామ పెద్దలు, మా , గ్రామ యువత సహకారం ఎల్లవేళలా మాకు ఉంటుందన్నారు. చిదురుప్ప అశోక్ గౌడ్ తమ్ముడు చిదురుప్ప భాస్కర్ గౌడ్ నాలుగు లక్షల పదివేల రూపాయలకు లడ్డును వేలంపాటలో పాడి సొంతం చేసుకున్నారు, సోమవారం నిమర్జనం సందర్భంగా అన్న ప్రసాదా వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి, హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమాని గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగ నిర్వహించామన్నారు. కళాకారులు మిమిక్రీ యాక్టర్స్, జబర్దస్త్ కామెడియన్ల కామెడీ షో, సినీ పాటలతో సింగర్స్, ఆర్కెస్ట్రాతో మా గ్రామ ప్రజలను అలరింపజేశారు . గణనాధుని చల్లని చూపులు చిదురుప్ప అశోక్ గౌడ్, చిదురుప్ప భాస్కర్ గౌడ్ కుటుంబ సభ్యుల పైన మా గ్రామ ప్రజల పైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.