

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27 :- ఏన్కూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు కట్ట ప్రక్కన గల ముత్యాలమ్మ గుడి పరిసరాలలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని, ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దులను గుర్తించాలని ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఏన్కూర్ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే లో తహసిల్దార్ కు ఏన్కూర్ వాసులు వినతిపత్రం అందజేశారు.