

గ్రామీణ వైద్యుడు షేక్ జానీ
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27
మండల పరిధిలోని కొత్త మేడేపల్లి పాఠశాల విద్యార్థులకు గ్రామీణ వైద్యుడు షేక్ జానీ ప్లేట్లు, గ్లాసులు, చాపలను అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. చదువుకోవాలని కోరిక ఉన్న 12 మంది గిరిజన చిన్నారుల గురుకుల ప్రవేశ పరీక్షకు తన సొంత ఖర్చులతో దరఖాస్తు చేశారు. దీంతో గిరిజన చిన్నారుల తల్లితండ్రులు గ్రామీణ వైద్యుడు షేక్ జానీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయరాం, సిబ్బంది పాల్గొన్నారు.