

విద్యార్థిని అభినందించిన ఎంపీడీవో తాళ్లూరి రవి
జూలూరుపాడు,జనం న్యూస్(సెప్టెంబర్ 02):
జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మొగిలి గీతిక విద్యార్థిని 8వ తరగతికి నవోదయ సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి విద్యార్థిని మొగిలి గీతికను శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి ఎక్సలెంట్ స్కూల్లో నవోదయ సీటు జిల్లా స్థాయిలో సాధించి మండలానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణం అన్నారు. నవోదయ సీటు కోసం విద్యార్థి పట్ల శ్రద్ధ కలిగి కృషిచేసిన స్కూల్ మేనేజ్మెంట్ కు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థినికి నవోదయ సీటు సాధించడానికి ప్రోత్సహించిన విద్యార్థిని తండ్రి మొగిలి కృష్ణను ఆయన అభినందించారు. మునుముందు ఇంకా కాంపిటేటివ్ పరీక్షల్లో సాయి ఎక్సలెంట్ స్కూలు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సాయి ఎక్స్లెంట్ పాఠశాల డైరెక్టర్ ఆరెబోయిన హుస్సేన్ మాట్లాడుతూ నవోదయలో మొగిలి గీతిక సీటు సాధించడం చాలా ఆనందంగా ఉందని, ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి 6వ తరగతికి నవోదయలో ఆరుగురు విద్యార్థులు మా యొక్క పాఠశాల నుంచి సీట్లు సాధించడం జరిగిందన్నారు. పల్లె పల్లెకు పట్టణ స్థాయి విద్యను అందించడమే మా యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్లు జక్కుల శివకుమారి, ఆరెబోయిన నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.