Listen to this article

జనం న్యూస్ జనవరి 27ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం కొరకు అహర్నిశలు పోరాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం జనంలో ఉంటూ ప్రజా పోరాటాలు చేస్తున్న డివైఎఫ్ఐ కి అభినందనలు తెలిపారు యువతను మంచి దారిలో నడిపిస్తూ యువకుల్లో క్రీడా మరియు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది యువతను ప్రోత్సహిస్తుంది. అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తు ప్రజాసేవ చేస్తూ జిల్లాలో యువజన మహిళా సమస్యలపై విద్యార్థుల ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచి సమస్యలను పరిష్కారం దిశగా పోరాటం చెయ్యటం అభినంద నీయమని డివైఎఫ్ఐ నాయకత్వాన్ని అభినందనలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ విమలేష్ సాయి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు