Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 2

ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కలుజువ్వలపాడు మరియు ఒబాయపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మార్కాపురం బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ 2025 ఈ పంట నమోదు కార్యక్రమంలో రైతులందరూ తమ సాగుచేసిన పంటలను మరియు సాగు చేయని బీడు భూములను అన్ని కూడా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి పి. జ్యోష్ణ దేవి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియా, డిఏపి, మరియు 20:20:0:13 ఎరువులను కలుజువ్వలపాడు రైతుసేవ కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ-పంటలో నమోదైన రైతులకు ఎరువులను సరఫరా చేస్తామని తెలియజేశారు డి ఆర్ సి ఏవో శైలజ రాణి మాట్లాడుతూ రైతులు సాగు చేసిన కంది, బొప్పాయి, మిరప మొదలగు పంటలలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బొప్పాయి పంట సాగు చేస్తున్న రైతుల తోటలను పరిశీలించారు. హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ బొప్పాయి తోటలలో సూక్ష్మధాతు జింకు, బోరాన్, మాంగనీస్, ఐరన్ లోపాలు గమనించడం జరిగింది. జింకు దాతులోపం నివారణకు జింక్ సల్ఫేట్ మూడు గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు. సూక్ష్మధాతు లోపాలను నివారించుట కొరకు మైక్రో న్యూట్రియన్స్ మిక్చర్ 3 గ్రా లీటరు నీటికి వాడి సూక్ష్మదాతు లోపాలను సవరించుకోవచ్చు అని తెలియజేశారు. మొజాక్ వైరస్ నివారణకు రసం పిలిచే పురుగులను అదుపు చేసుకోవాలని,ఇమిడాక్లోప్రిడ్ 2 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలుజువ్వలపాడు పశు వైద్యాధికారి సౌజన్యభాయి, వి హెచ్ ఏ సుస్మిత,రైతులు పాల్గొన్నారు.