Listen to this article

జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి దాదాపు 35 సంవత్సరాల తర్వాత 1989-90 లో పదవ తరగతి ( జడ్.పి.హెచ్.ఎస్) పాములపర్తిలో పూర్తి చేసుకున్న విద్యార్థులు తేదీ 27/01/2025 ( డి ఎన్ ఆర్ )ఫంక్షన్ హాల్ గౌరారం నందు కలుసుకున్నారు . వారంతా కలిసి బాల్యంలో జరిగిన సంగతులను గుర్తు చేసుకుని ఆనందంగా గడప డం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు, నరహరి రావు , రాంరెడ్డి , విధుమౌళి, పాల్గొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం అభినందనీయమని పేర్కొన్నారు. ఇట్టి సమావేశంలో జహంగీర్, రమేష్, రామచంద్ర0 ,శ్రీనివాస్, కరుణాకర్, వీరేశo, రాజిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, జయ, ప్రమీల, ప్రేమల త,నాగ లక్ష్మి, మంగ, వరమ్మ ,జ్యోతి, పాల్గొన్నారు.