

జనం న్యూస్ సెప్టెంబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి సౌత్2 లో వున్న పులికాలువ వయా చెర్లోపల్లి కాలువ ఆక్రమంగా గొట్టాలు వేసి మూసివేసి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు జీవితాలతో ఆటలాడుకొనే వారిపై తక్షణ చర్యలు గైకొనాలని సీనియర్ రాజకీయ నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు పులి కాలువ డైరెక్టర్ సూరిశెట్టి ఈశ్వర రావులు అనకాపల్లి ఇరిగేషన్ ఆఫీసర్ రూపదేవి కి ఫిర్యాదు యివ్వటం జరిగింది.పులి కాలువ క్రింద సుమారు 600 యకరాలు సాగుబడిలో వరి, నువ్వులు, కాయకూరలు పండిస్తూ రైతులు జీవనోపాధి చేసుకుంటున్నారు ఈ కాలువ గుండా వచ్ఛే నీరే, పంటలకు ఆథారం. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆకుమడులకు , ఉడుపులకు కాలువ ద్వారా వచ్చే నీరును మళ్లించి పంటలు పండిస్తారు. కాని ఈరోజు కొందరు దౌర్జన్యం గా కాలువ గుండా గొట్టాలు వేసి మట్టితో కాలువను పూర్తిగా కప్పివేసి రైతులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రమణ అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలు క్రితం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పులి కాలువ,యల్లయ్య కాలువ, చెర్లోపల్లి కాలువ లకు సుమారు రూ” 2 కోట్ల 80లక్షలు శాంక్షన్ తో పాటు పూర్తి స్థాయిలో కాలువలు త్రవ్వించటంతో రైతులు ఎంతో సంతోషం తో ఉండగా, కొందరు తమ స్వప్రయోజనాల కోసం కాలువను మూసివేస్తే రైతులు నీరు లేకుండా పంటలు ఎలా పండిస్తారని రమణ అప్పారావు ప్రశ్నించారు. అసలు ఆవఖండం లోతట్టు ప్రాంతం గాన అక్కడ రోడ్లు వేయిట వలన పెద్ద వర్షాలకు , తోటాడ రెగ్యులర్ యార్డు గేట్లు మూసివేస్తే అనకాపల్లి పట్టణం లోకి నీరు వచ్చి మునిగి పోయే ప్రమాదం పొంచి వున్నదని, దీనిపై కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని రమణ అప్పారావు కోరారు.//
