

జనం న్యూస్, జనవరి 28, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
“పోలీస్ స్టేషన్ కేంద్రంగా బహిరంగంగా సెటిల్మెంట్ దందాలు,
మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేసుకొని లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్న ఎస్ఐ,
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పై రవికారులకు పంచాయతీలు అప్పజెప్పి మామూలు తీసుకుంటున్న ఎస్ఐ
తిరుమలగిరి, పోలీస్ స్టేషన్లో పేదవాడికి న్యాయం జరగడం లేదని ఆరోపణ,
పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే ఎస్సైకి అనుకూలంగా ఉన్న పైరవీ కారులు చెబితేనే పిటిషన్ తీసుకుంటున్న పోలీసులు… పంచాయతీకి ఒకరేటు నిర్ణయించిన ఎస్ఐ”
తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజులు,పీడీఎస్ బియ్యం కేసులో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు చేసి పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా,వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడులు చేయగా పట్టుబడ్డారు.