Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండల కేంద్రం దాసరి గడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు కువైట్ జనసైనికులు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి&దాసరి గడ్డ యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక అంగారంగా వైభవంగా జరిగింది.ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా దాసరి గడ్డలలో ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం ముందర NDA కూటమి నాయకులతో వందలాది మంది జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని దాసరి గడ్డ నుంచి నందలూరు బస్టాండ్ వరకు ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.బస్టాండ్ భారిగా వచ్చిన జనసైనికల సమక్షంలో కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు మాజీ MPP పల్లె సుబ్ర హ్మణ్యం ,హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర,లక్ష్మినర్సయ్య ,కల్లామొహన్ మంకు వెంకటేశ్ ,పోలిశెట్టి శ్రీని వాసులు,మండెం రాము,టైలర్ డా లా,శంకర, కృష్ణ,వీరయ్య అచారి, రెడ్డేయ్య,వంశీ,ఈదరపల్లి శీను,గాంధీ,పసుపులేటి చిన్న,రత్నం,కొట్టేహరి ,కార్తీక్,కరణం శ్రీధర్,NRI వెంకట్ అరిగె సాయి,భాస్కర్,భారీగా జనసైనికులు,దాసరి గడ్డ యువత పాల్గొన్నారు.