

జనం న్యూస్ సెప్టెంబర్ 3 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుని మండపంలో జరిగిన ” గ్రంధి” వారి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. అవినాష్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ, ఫణికాంత్ శాస్త్రి లచే ఆశీర్వచనం జరిపి, ఉత్సవ కమిటీ సభ్యులచే దుస్సాలువా కప్పి, స్వామివారి చిత్రపటంతో సత్కరించడం జరిగింది.. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఎంతో వైభవంగా ఉత్సవాలని జరుపుతున్న కమిటీ వారిని అభినందిస్తూ, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఊరేగింపులలో ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సాగనంపాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంథి నానాజీ,గ్రంధి సురేష్, ఆశపు సూర్యారావు, నరేష్, లక్ష్మణరావు, శంకరం, నాగబాబు, ఆకేటి శీను, అంకం రాజు, ఆశపు శ్రీను, గోపాలకృష్ణ, విళ్ల శివ, బషీర్, నాగభూషణం, చెరుకు బుజ్జి, శివయ్య,అంకం వెంకటేశ్వరరావు,గోకవరపు బ్రదర్స్ పాల్గొన్నారు.
