Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోన గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భారీ అన్న సమారాధన మండల కేంద్రమైన కాట్రేని కోన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ వినాయకుని ప్రతిష్టించి పూజిస్తారు. అన్న సమారాధన నిర్వహించి, ఊరేగింపులు జరిపి స్వామివారిని నిమజ్జనం చేస్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.