

జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం తూర్పు బలిజ వీధిలో పేకాట శిబిరంపై మంగళవారం దాడి చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.4416 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.