

జనం న్యూస్ 03 సెప్టెంబర్ ( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బిజెపి పార్టీ OBC నాయకులు తీవ్రంగా డించారు.నాయకులు మాట్లాడుతూ – “ప్రతి పక్ష పార్టీలకు కనీస గౌరవం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. మండలంలో ఉన్న ప్రధాన సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలనుకున్న మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారు పేర్కొన్న ప్రధాన సమస్యల్లో సీతారామ ప్రాజెక్టు నీటిని మండల రైతులకు అందజేయడం,వెంగళరావు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించడం,మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు,రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం వంటి అంశాలు ఉన్నాయి.
“ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి అణచివేత అసహ్యం” అని బిజెపి నాయకులు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కొడేం నాగేశ్వరావు, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.