Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాగానే వెంటనే ఆమెపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి మొదలు పెట్టాయి.నిన్నా మొన్నటి వరకు కవిత విషయంలో ఎటుూ తేల్చుకోలేక సంశయంలో పడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా విమర్శల దాడి మొదలు పెట్టారు. గల్లీ నుంచి స్టేట్ లీడర్లవరకు కవితపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైతం కవితకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇంట్రెస్టింగ్ గా మారింది.కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మద్దతుదారులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ నడుస్తోంది. పార్టీకి నష్టం చేస్తున్న వారిని గురించి చెబితే జాగ్రత్త పడాల్సింది పోయి సస్పెండ్ చేస్తున్నారని కవిత మద్దతుదారులు మండిపడుతున్నారు. 2018 ఎన్నికల సమయంలో గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనకు హరీశ్ రావు ఫోన్ చేశారని, కేసీఆర్‌ని ఓడించాలని చెప్పారని తెలిపారు. ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటానని, అంతేకాకుండా అన్ని విధాలుగా అండగా ఉంటానని, కేసీఆర్ ఓడిపోతే అంత మనదేనని తనకు ఫోన్‌లో హరీశ్ రావు చెప్పారని వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. అయితే ప్రస్తుంత వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నా తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వీడియోను కవిత అనుచరులు వైరల్ చేస్తున్నారు.తెరపైకి లిక్కర్ స్కామ్:తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కవితకు వ్యతిరేకంగా ఢిల్లీ లిక్కర్ స్కాన్ ను (Delhi Liquor Scam) తెరపైకి తీసుకువస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు తో ఎలాంటి నష్టం, జరగలేదని జరిగిన నష్టం అంతా లిక్కర్ స్కామ్ వల్లేనని ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో స్వయంగా కేసీఆర్ కూతురు చిక్కుకోవడం వ్యక్తిగతంగా కేసీఆర్ తో పాటు పార్టీని డిఫెన్స్ లోకి నెట్టివేసిందని ఈ కేసు రూపంలో కవిత అంటించిన మరక పార్టీకి, కేసీఆర్ కు ఎప్పటికీ పోదంటూ బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు చేస్తున్నారు. విమర్శలు ప్రతివిమర్శలతో కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది కీలకంగా మారింది.