

పాపన్నపేట, సెప్టెంబర్ 2 (జనంన్యూస్)
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట నవయువ సేవా సంఘం గణేష్ మండపం వద్ద మంగళవారం పూజలు కొనసాగాయి. అర్చకులు డిగంబర శర్మ,శేషాద్రి శర్మల ఆధ్వర్యంలో గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ అంగరంగ వైభవంగా సాగింది. పలు ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. గణపతి హోమం దాతగా లింగంపేట నరేందర్ గౌడ్,అన్నప్రసాద దాతగా గజవాడ రాజేశ్వర్ గుప్తలు వ్యవహరించారు. నిర్వాహకులు,గ్రామస్తులు,తదితరులున్నారు.