Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- వెలిగండ్ల (ప్రకాశం జిల్లా): రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడడం, పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. డ్రైవర్లు లైసెన్సులు కలిగి ఉండడంతోపాటు, వాహన రికార్డులు కలిగి ఉండాలన్నారు.