Listen to this article

జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 29వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కావున భక్త మహాశయులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కోరారు. కులమతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటుతూ గత 28 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. శనివారం 6వ తారీఖున గణనాథుని శోభయాత్ర జరుగుతుందని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కోరారు.