Listen to this article

జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

పాత కేటగిరీలనన్నిటిని కొనసాగించాలని

గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలి

గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ రాధాకృష్ణ

జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని,వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని,గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని,గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు పలు డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ కార్మికులకు రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కనీస వేతనం అమలు చేస్తామని,హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అనేక హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిందని అన్నారు. 2025 జనవరిలో కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నేరుగా ప్రభుత్వమే కార్మికులకు అకౌంట్లో వేతనాలు వేస్తామని చెప్పడం జరిగింది అది ఇప్పటికీ సరిగా అమలుకు నోచుకోలేదన్నారు.
పంచాయతీ సిబ్బందిని కూడా రెండవ పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని కారోబార్ బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అర్హులైన సిబ్బందికి ప్రమోషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చల కూర స్వరాజ్యం,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ బండారు గురవమ్మ, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్ నాగార్జున, మామిడి వెంకన్న, కమిటీ సభ్యులు వి వెంకటేశ్వర్లు, పి నరసయ్య, ఎస్ రఘు, ఎం ముత్తయ్య, సాగర్, ఎస్ నాగరాజు, ఎం మరియమ్మ, విమల, కుమారి, డి రవి, తదితరులు పాల్గొన్నారు.