Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ వేదికగా మండల విద్యాధికారి ఏ వెంకట రాములు, అధ్యక్షతన మండల స్థాయి 69వ ఎస్ జి ఎఫ్ క్రీడోత్సవాలను ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాస్ రెడ్డి, ప్రారంభించారు. ఆరంభ మ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ మరియు పాములపర్తి మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ ను సర్వీసు ఇచ్చి జిల్లా విద్యాధికారి ‌మొదటి రోజు ఆటలను ప్రారంభించారు. మొదటిరోజు అండర్ 14, అండర్ 17 విభాగాలలో కోకో మరియు వాలీబాల్ క్రీడలను తీసుకోవడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణను, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని, విద్యార్థులందరూ ప్రతిరోజు ఒక పీరియడ్ ఆటలు ఆడాలని సూచించారు. ఈ క్రీడోత్సవాల ద్వారా క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో ఈ రెండు రోజులు ఆడాలని విద్యార్థులందరినీ కోరారు. ఈ క్రీడోత్సవాలకు అతిథిగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దామోదర్ పాల్గొన్నారు. ఇట్టి క్రీడోత్సవాలకు బబ్బూరి మల్లేశం గౌడ్, బహుమతుల దాతగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రీడలకు మొర్సు కరుణాకర్ రెడ్డి, క్రీడాకారులందరికి భోజన వసతి కల్పిస్తున్నారు. కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. మండల స్థాయి క్రీడోత్సవాలకు మర్కుక్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జి.వెంకటేశం, చేబర్తి కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు శంకర్ రెడ్డి, జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల పాములపర్తి ప్రధానోపాధ్యాయులు లతీ సైదా ,పిఆర్టియు అధ్యక్షులు రేబల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుమ్మ కుమార్, టిపిటిఎఫ్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యుటిఫ్ ప్రధాన కార్యదర్శి బాల నరసయ్య, యస్జి టి యు అధ్యక్షులు ముత్తయ్య, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, దాదాపు 250 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మొదటి రోజు ఆటలను విజయవంతం చేశారు. రెండో రోజు కబడ్డీ క్రీడాంశంగా అండర్ 14, అండర్ 17 విభాగంలో పోటీలు జరుగుతాయని ఎస్జీఎఫ్ మండల స్థాయి కమిటీ సభ్యులు తెలియజేశారు.