Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు పై వేసిన కమిషన్ చెత్త కమిషన్ అని భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు మండల కేంద్రంలోని మాందారి పేట పరకాల జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన శాసనసభలో యూరియా కష్టాలను సభ దృష్టికి తీసుకెళ్లామని అయిన ప్రభుత్వం పరిష్కారించక పోవడం సిగ్గు చేటు అని అన్నారు రైతులకు జీవనధార సంజీవని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పై అవగాహన లేని వాఖ్యలు చేయడం కాంగ్రెస్ నేతల అవివేకానికి నిదర్శనం అని అన్నారు అనంతరం రైతుల వద్దకు వెళ్లి యూరియా బస్తా ఎ ధరకు ఇస్తారు అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఉప సర్పంచ్ సుమన్ పి ఎ ఎస్ సి తిరుపతి రెడ్డి మాజీ సర్పంచ్ నందం బీఆర్ఎస్ నాయకులు కోముల శివ శ్రావణ్ కుమార్ బాబు మారపెల్లి మోహన్ రైతులు తదితరులు పాల్గొన్నారు….