

జనం న్యూస్ //జనవరి //28//జమ్మికుంట //కుమార్ యాదవ్.
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహం(బాలికలు) లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, వసతి గృహంలోని విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలునిర్వహించడం జరిగింది,ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు టిబి నిక్షయ్ శివిర్ 100 రోజుల ప్రణాళిక లో భాగంగా క్షయ వ్యాధి మీద మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత,సీజనల్ డిసీజెస్ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద డ్రై డే మీద అవగాహన కల్పించడం జరిగింది,చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థినులకు మందులు ఇవ్వడంజరిగింది.
ఈ వైద్య శిబిరంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ చందన మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌందర్య,సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది సాజిదా,రామకృష్ణ, నరేందర్ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.