Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):-

కొమరోలు : గిద్దలూరు లోని ప్రభుత్వ వైద్యశాలలో 29 వ తేదీ బుధవారం కొమరోలు మండలంలోని వికలాంగులకు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో మస్తాన్ వలి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వికలాంగులకు అవసరమైన పనిమూట్లను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. కొమరోలు మండలంలోని వికలాంగులు ఈ విషయాన్ని గమనించి గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లాలని సూచించారు.