

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):-
మార్కాపురం: దోర్నాల మండలం తుమ్మల బైలుకు చెందిన గిరిజన మహిళలకి, అధికారులు అంగన్వాడి ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ పంపారు. తీరా ఇంటర్వ్యూ కోసం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఇంటర్వ్యూ కోసం వచ్చిన గిరిజన మహిళలకు, ఇంటర్వ్యూలో మీ పేరు లేదని అధికారులు చెప్పడంతో గిరిజన మహిళలు నివ్వెరపోయారు. లెటర్లు పంపి ఇప్పుడు ఇంటర్వ్యూలో మా పేరు లేదని చెప్పడం ఏమిటని గిరిజన మహిళలు ఆందోళన చేపట్టారు.